ఓ వ్యక్తికి సిగరెట్(Cigarette) తాగుతూ రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందుకు వేదికగా అతడు పోలీస్‌స్టేషన్‌ను ఎంచుకున్నాడు. కావాలని పోలీస్‌స్టేషన్ ఎదుట రీల్స్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తుండేవాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించింది.
ఓ వ్యక్తికి సిగరెట్(Cigarette) తాగుతూ రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందుకు వేదికగా అతడు పోలీస్‌స్టేషన్‌ను ఎంచుకున్నాడు. కావాలని పోలీస్‌స్టేషన్ ఎదుట రీల్స్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తుండేవాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించింది. రాంగోపాల్‌పేట(Ramgopalpet) సీఐ లింగేశ్వర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాటిగడ్డ ఎన్‌బీటీనగర్‌కు చెందిన ఓ యువకుడు వంశీకృష్ణ (25) ఈ నెల 17న రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో(Social media) పోస్ట్ చేశాడు. ఇది గమనించిన పోలీసులు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి సికింద్రాబాద్ 16వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా.. వంశీకృష్ణకు ఎనిమిదిరోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.