కవితను సీబీఐ న్యాయమూర్తి కావేరీ బవేజా ఎదుట హాజరుపరిచారు. ఆదివారం విచారణలో

మద్యం కుంభకోణం విచారణలో భాగంగా కవితకు రూస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోర్టులో కవితను హాజరు పరిచిన సీబీఐ అధికారులు, కవితని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని కోరింది. కవిత విచారణకు సహకరించలేదని సీబీఐ తెలిపింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు కవితను 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇది బీజేపీ కస్టడీ, సీబీఐ కస్టడీ కాదన్నారు కవిత. బయట బీజేపీ వాళ్ళు అడిగింది లోపల సీబీఐ అడుగుతూ ఉందని, కొత్తది ఏమీ లేదని కవిత చెప్పుకొచ్చారు.

కవితను సీబీఐ న్యాయమూర్తి కావేరీ బవేజా ఎదుట హాజరుపరిచారు. ఆదివారం విచారణలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ ద్వారా సేకరించిన చాటింగ్‌లు, మహబూబ్‌నగర్‌లో భూముల వ్యవహారం లాంటి అంశాలపై కవితను ప్రశ్నించారు. కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను ఇవాళ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

Updated On 15 April 2024 1:13 AM GMT
Yagnik

Yagnik

Next Story