మూఢ నమ్మకాల పేరుతో దారుణాలు జరుగుతున్నాయి. తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా సదాశివపేట(SadhashivaPeta) మండలం కొల్కూరులో(Kolkuru) అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సరైన సమయంలో స్పందించడంతో దంపతులకు ప్రాణాపాయం తప్పింది.

Black Magic
మూఢ నమ్మకాల పేరుతో దారుణాలు జరుగుతున్నాయి. తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా సదాశివపేట(SadhashivaPeta) మండలం కొల్కూరులో(Kolkuru) అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సరైన సమయంలో స్పందించడంతో దంపతులకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సదాశివపేట పట్టణ సీఐ నవీన్ కుమార్(CI Naveen Kumar) తెలిపారు. గత కొన్ని రోజులుగా కొల్కూరులోని కొందరు అనారోగ్యానికి గురయ్యారు. ఇదే విషయమై వారు స్థానికంగా క్షుద్రపూజలు చేసే వ్యక్తిని సంప్రదించారు. దీంతో అతడు మీ ఇంటి పక్కన ఉండే వ్యక్తే మీపై చేతబడి చేశాడని చెప్పాడు. ఈ క్రమంలోనే ముత్తంగి యాదయ్య(Muthangi Yadhaiah), అతని భార్య అమృతమ్మలను(amrutha) అదే గ్రామానికి చెందిన కొందరు.. పంచాయతీ సమీపానికి పిలిపించారు. అందరూ చూస్తుండగానే దంపతులను ఓ చెట్టుకు వేలాడదీశారు. ఆపై ఆ దంపతులపై దాడి చేశారు. చేతబడి(Black Magic) చేశారంటూ చిత్రహింసలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. యాదయ్య, అమృతమ్మలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
