ఏడేళ్లుగా మానసిక రుగ్మతతో(mental disorder) బాధపడుతున్న కూతురుకు చికిత్స చేయించారు. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వ్యాధి కొంత వరకు నయమయ్యింది. దాంతో పెళ్లి చేశారు. అయితే నెల రోజుల కింద వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. భర్తను, కొడుకున కొట్టడం, చుట్టుపక్కల వారితో గొడవపడుతుండటంతో తల్లిదండ్రులకు విసుగుపుట్టింది.
ఏడేళ్లుగా మానసిక రుగ్మతతో(mental disorder) బాధపడుతున్న కూతురుకు చికిత్స చేయించారు. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వ్యాధి కొంత వరకు నయమయ్యింది. దాంతో పెళ్లి చేశారు. అయితే నెల రోజుల కింద వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. భర్తను, కొడుకున కొట్టడం, చుట్టుపక్కల వారితో గొడవపడుతుండటంతో తల్లిదండ్రులకు విసుగుపుట్టింది. నిద్రిస్తున్న కూతురుకు ఉరి వేసి చంపేశారు. సిరిసిల్ల(sircilla) జిల్లాలో జరిగిన ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. తంగళ్లపల్లి మండలం చెప్యాల ఎల్లవ్వ, నర్సయ్య దంపతులకు కూతురు ప్రియాంక. 27 ఏళ్ల ప్రియాంక ఏడేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నది. తల్లిదండ్రులు ప్రియాంకకు పలు ఆసుపత్రులలో చికిత్స చేయించారు. కూతురు వ్యాధి నయం కావాలంటూ కనబడిన దేవతలకు మొక్కారు. అనేక గుళ్లు గోపురాలకు తీసుకెళ్లారు. బంధుమిత్రులు ఇచ్చిన సలహాలను పాటించారు. ఈ క్రమంలో వ్యాధి నయం కావడంతో 2020లో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. వీరికి 13 నెలల బాబు ఉన్నారు. కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు దంపతులు. కూతురు కాపురం చక్కగా సాగుతుండటంతో తల్లిదండ్రులు ఆనందపడ్డారు. అయితే వారి సంతోషం ఎక్కువ కాలం కొనసాగలేదు. నెల రోజుల కిందట ప్రియాంకకు వ్యాధి తిరగపెట్టింది. చుట్టుపక్కల వారిని తిట్టసాగింది. తరచూ గొడవపెట్టుకునేది. మొగుడిని కొట్టేది. చిన్నపిల్లాడని కూడా చూడకుండా కొడుకును కూడా కొట్టేది.
అనేక ఆలయాలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వ్యాధి నయం కావడంతో 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. వీరికి 13 నెలల బాబు ఉన్నాడు. వీరు కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రియాంక పరిస్థితిని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు భర్త. వారు కరీంనగర్‌కు వచ్చి కూతురుకు చికిత్స చేయిస్తామని చెప్పి ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. ప్రియాంకను స్థానిక బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ మూడు రోజులపాటు ఉంచారు. అయినప్పటికీ ప్రియాంకలో మార్పు రాలేదు. దాంతో ఈ నెల 14వ తేదీన రాత్రి ఒంటి గంటకు ఇంట్లో నిద్రిస్తున్న కూతురిని నూలు దారంతో ఉరేసి చంపేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందించిన సమాచారం మేరకు భర్త.. ప్రియాంక మృతదేహాన్ని నంగునూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. అయితే స్థానికంగా ఉన్న ఓ వ్యక్తికి ప్రియాంక మృతిపై అనుమానం కలిగింది. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి తన సందేహాన్ని తెలిపాడు. పోలీసులు వచ్చి చుట్టుపక్కల వారిని విచారించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సయ్య, ఎల్లవ్వను అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపినప్పుడు వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.