మనిషి అన్న తర్వాత జీవిత కాలంలో పొరపాట్లు చేయడం చాలా సహజం.

మనిషి అన్న తర్వాత జీవిత కాలంలో పొరపాట్లు చేయడం చాలా సహజం. అవి సరిదిద్దుకుని ముందుకు వెళ్తే జీవితమంతా సాఫీగా సాగుతుంది. కానీ సమాజం సూటిపోటి మాటలతో కాకులు, గద్దల్లా పొడుస్తుంటే అవమానంగా భావించారు. సమాజంలో ఈ జంట తలెత్తుకోలేకపోయింది. అన్యోన్యంగా నిండు నూరేళ్లు జీవించాల్సిన జంట అర్ధాంతరంగా తన జీవనగమనాన్ని ముగించింది. బంధువులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెంది రైలు కింద పడి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. తాము ఆత్మహత్య(Suicide) చేసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో(Selfi videos) తీసి ఎస్సైకి పంపించారు. ఎస్సై ఎంత ప్రయత్నించినా వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌-మిట్టాపూర్‌ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్, పోతంగల్‌కు చెంది శైలజకు వివాహం జరిగింది. ఈ జంట పెళ్లయి ఏడాది గడిచింది. అయితే వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు ఇంట్లోవారికి చెప్పి బయటకువచ్చారు. కొద్ది సేపటి తర్వాత శైలజ ఓ సెల్ఫీ వీడియో తీస్తూ తాను తెలిసీ తెలియక ఓ తప్పు చేశానని, దానిని తన భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని మాట్లాడింది. ఈ వీడియోను కోటగిరి ఎస్సై సందీప్‌కు ఆమె పంపించింది. ఈ వీడియో చూసిన ఎస్సై సందీప్‌ దీన్ని నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్‌కు వీడియోతో పాటు సెల్‌ఫోన్‌ నెంబర్‌ను కూడా పంపించారు. అప్రమత్తమైన నవీపేట పోలీసులు బాసర వంతెనకు వెళ్లి గాలించగా ఈ జంట కన్పించలేదు. సెల్‌ఫెన్‌ నెంబర్‌ను ట్రాక్‌ చేయగా ఫకీరాబాద్-మిట్టాపూర్‌ మధ్య ఉన్నట్లు గుర్తించి అక్కడి వెళ్లి గాలించసాగారు. అక్కడే రైలుపట్టాలపై(railway track) ఆత్మహత్య చేసుకొన్న అనిల్, శైలజ మృతదేహాలు కనిపించాయి. రైల్వేపోలీసులకు సమాచారం అందించారు స్థానిక పోలీసులు. అయితే పొరపాట్లు సహజం, వాటిని సరిదిద్దుకొని, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతున్న వీరి కాపురంలో బంధువులు చిచ్చుపెట్టి, వారి ప్రాణాలనే పోగొట్టుకునేవరకు తెచ్చిన ఈ ఉదంతంతో వారి కుటుంబాలు, స్వస్థలాల్లో విషాదం నెలకొంది.

Eha Tv

Eha Tv

Next Story