హైదరాబాద్(Hyderabad) వనస్థలిపురం పీఎస్‌లో(Vanastalipuram PS) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్(Hyderabad) వనస్థలిపురం పీఎస్‌లో(Vanastalipuram PS) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు సాహెబ్‌నగర్ గాయత్రీనగర్ ఏరియా నుంచి ఈ మధ్య డయల్ 100కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమస్యను తెలుసుకునేందుకు పోలీసులు వెళ్లారు. వారిలో జగన్‌గౌడ్(Jagan goud) అనే ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. గన్‌గౌడ్‌కు బాధితురాలితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల(Financial transactions) వరకూ దారితీసింది. తన బంగారాన్ని తాకట్టుపెట్టి డబ్బు తెచ్చి మరీ ఆమె కానిస్టేబుల్‌కు ఇచ్చింది. ఈ డబ్బు తిరిగి ఇవ్వడంలో కానిస్టేబుల్ జాప్యం చేస్తుండటంతో బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో ఈ నెల 4న ఇంజాపూర్‌లో కమాన్ వద్ద మా అమ్మానాన్న ఉన్నారని, వాళ్లిచ్చే డబ్బు ఇస్తానని నమ్మించి కారులో ఇంజాపూర్ వైపు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశంలోకి తీసికెళ్లి ఆమెపై కానిస్టేబుల్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి ఆమె తప్పించుకొని ఇంటికి చేరుకుంది. ఈ విషయంపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు.