నేడు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ధ‌ర్నా చేప‌ట్ట‌నుంది. శుక్ర‌వారం ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు

నేడు ఇందిరా పార్కు(Indira Park) ధర్నా చౌక్(Dharna Chowk) వద్ద కాంగ్రెస్(Congress) ధ‌ర్నా చేప‌ట్ట‌నుంది. శుక్ర‌వారం ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంద‌ని అధిక సంఖ్య‌లో పాల్గొనాల‌ని ఇప్ప‌టికే టీపీసీసీ పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు, సీనియర్ నాయకులు ధర్నాలో పాల్గొన‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి(I-N-D-I-A) పార్టీ ల నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొంది.

పార్లమెంట్ లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి నిరసనకు పిలుపునిచ్చింది. పార్లమెంట్ లో 13వ తేదీన ఆగంతకులు చొరబడి స్మోక్‌ బాంబులు వేసిన అంశంలో హోమ్ మంత్రి(Home Minister) పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఆందోళ‌న తీవ్ర‌త‌రం చేయ‌డంతో లోక్ సభ(Loksabha), రాజ్యసభ(Rajya Sabha) లలో ఎంపీలు స‌స్పెండ్‌(Suspend) అయ్యారు. ఈ విష‌య‌మై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి నేడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాలలో ఇండియా కూటమి తో కలిసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా.. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ కూడా సూచించింది.

Updated On 21 Dec 2023 10:01 PM GMT
Yagnik

Yagnik

Next Story