తెలంగాణ(telangana) రాష్ట్రంలో ఎన్నికల(Election) రచ్చ మొదలైంది. బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్(Congress), బీజేపీలు(BJP) త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే టీపీసీసీ(TPCC) చీఫ్ రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ(telangana) రాష్ట్రంలో ఎన్నికల(Election) రచ్చ మొదలైంది. బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్(Congress), బీజేపీలు(BJP) త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే టీపీసీసీ(TPCC) చీఫ్ రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అతడిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని కొత్త మనోహర్ రెడ్డి(Kotha Manohar Reddy) ఆరోపించారు.
మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి నుంచి రూ.10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నారని ఆయన ఆరోపించారు. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బయట పెడతానని మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కొత్త మనోహర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆశావహుల్లో డీసీసీ చీఫ్ చల్లా నర్సింహరెడ్డితో(challa Narsimha Reddy) పాటు కొత్త మనోహర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్మేటి అమరేందర్ రెడ్డి, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.