ఎల్బీ నగర్ బాధిత గిరిజన మహిళా(Tribe women) కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్(Congress) సీనియర్ నేత వీహెచ్(V.Hanumantha Rao) ప్రభుత్వాన్ని కోరారు. లక్ష్మిభాయి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న లక్ష్మి భాయి కూతురు వివాహం జరుగుతుందని పేర్కొన్నారు.
ఎల్బీ నగర్ బాధిత గిరిజన మహిళా(Tribe women) కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్(Congress) సీనియర్ నేత వీహెచ్(V.Hanumantha Rao) ప్రభుత్వాన్ని కోరారు. లక్ష్మిభాయి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న లక్ష్మి భాయి కూతురు వివాహం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక నాయకుడు చల్లా లక్ష్మారెడ్డి లక్ష రూపాయలతో పాటు.. మరికొంత మంది దాతల ప్రోత్సాహంతో రూపాయలు 5 లక్షలు అందిస్తామని వెల్లడించారు. వారం రోజుల లోగా రూ.5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందించి పేదింటి పెళ్లికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సబితా ఇంద్రారెడ్డిని(Sabitha Indra Reddy) సహాయం చెయ్యాలని కోరడం జరిగిందని తెలిపారు. అందుకు స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. 3 లక్షలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్నారని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రూ. 5 లక్షలు ఇవ్వడంతో పాటు.. లక్ష్మీబాయి ఇద్దరు పిల్లలకు ఇంటర్మీడియట్ వరకూ ఉచిత విద్యనందించాలని మంత్రికి మరొక లేక రాస్తామని తెలిపారు. పేదింటి పెళ్ళికి అన్ని పార్టీలు ముందుకు వచ్చి లక్ష్మీబాయి కుటుంబానికి అండగా నిలబడాని కోరారు.
ఇదిలావుంటే.. ఎల్బీనగర్ లో మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై ఇదివరకే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని డీజీపీ, సీఎస్ లను ఆమె ఆదేశించారు. తాజాగా ఆదివారం నాడు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. రాచకొండ సీపీ చౌహాన్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని ఆమె తెలిపారు. దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు. మహిళపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్, ఓ ఎస్సైపై 324, 354, 379, ST SC POA ACT 2015 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.