బీసీలకు ఐఐటీ, ఐఐఎం లలో రిజర్వేషన్స్(Reservations) కల్పించిన ఘనత కాంగ్రెస్(Congress Party) పార్టీదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(V Hanumantha Rao) తెలిపారు. బీసీల జనగణన జరపాలని..

Congress Senior Leader V Hanumantha Rao Comments On Reservations
బీసీలకు ఐఐటీ, ఐఐఎం లలో రిజర్వేషన్స్(Reservations) కల్పించిన ఘనత కాంగ్రెస్(Congress Party) పార్టీదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(V Hanumantha Rao) తెలిపారు. బీసీల జనగణన జరపాలని.. క్రీమిలేయర్ ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రధాని మోదీ(Narendra Modi)ని కలిసి ఎన్నిసార్లు కోరినా ఇంతవరకు స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. బడుగు బలహీనర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన గాంధీ కుటుంబం(Gandhi Family)లో మాత్రమే ఉందని ఆయన అన్నారు. రిజర్వేషన్స్ పెంచాలనే ఆలోచన రాహుల్ గాంధీ లో ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఈ అంశాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ పదవుల్లో బీసీల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీలను పార్టీ దగ్గర చేర్చుకోవాలి.. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాయకత్వానికి సూచించారు. హైకోర్టుకు వెళ్ళే దారిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని.. దీనిపై కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), అసదుద్దీన్(Asaduddin Owaisi)కు లేఖ రాశానని తెలిపారు. పాతబస్తీ లో అంబేద్కర్(Ambedkar Statue) విగ్రహం పెట్టాల్సి అవసరం ఉందని అన్నారు. అలాగే.. తాను తీసుకొచ్చిన అంబేద్కర్ విగ్రహానికి న్యాయం జరగాలని వీహెచ్(VH) కోరారు.
