అంబేద్క‌ర్ 125 అడుగులు విగ్రహం ఆవిష్కరణకు మేం వ్యతిరేకం కాదని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మల్లు రవి(Mallu Ravi) పేర్కొన్నారు. కానీ ఆయన రాసిన రాజ్యాంగ తిరిగి రాస్తా అని కేసీఆర్(KCR) అన్నారు.. దానిని నేను ఖండిస్తున్నా.. భారత దేశం(India) అంత కుటుంబం అని రాజ్యాంగం చెబుతుందని అన్నారు.

అంబేద్క‌ర్ 125 అడుగులు విగ్రహం ఆవిష్కరణకు మేం వ్యతిరేకం కాదని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మల్లు రవి(Mallu Ravi) పేర్కొన్నారు. కానీ ఆయన రాసిన రాజ్యాంగ తిరిగి రాస్తా అని కేసీఆర్(KCR) అన్నారు.. దానిని నేను ఖండిస్తున్నా.. భారత దేశం(India) అంత కుటుంబం అని రాజ్యాంగం చెబుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) అంబేద్క‌ర్ ఛైర్మన్ గా ఉన్న కమిటీతో కలిపి రాజ్యాంగం రాయించింది. రిజర్వేషన్ లు కల్పించిందని పేర్కొన్నారు. 2014 ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను బీఆర్ఎస్‌ ప్రభుత్వం(BRS Govt) ఎంత మేరకు ఖర్చు పెట్టింది. ఎంత కారిఫార్వర్డ్ చేసింది చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్(KCR) సొంత డబ్బు ఖర్చు పెట్టి.. విగ్రహ ఆవిష్కరణ చెయ్యలేదు కదా.. ప్రజల సొమ్ముతోనే పెట్టారని అన్నారు. కాంగ్రెస్.. దళితులకు ఎన్నో చట్టాలను తీసుకొచ్చిందన్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగానే ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి మీ పార్టీ నాయకులకి అప్పగించి.. దళితులకు అందులో చదివే అవకాశం లేకుండా చేసారని విమ‌ర్శించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రిజర్వేషన్ ప్రకారం 22% అంటే 44 వేల ఉద్యోగాలు రావాలన్నారు.

కేసీఆర్ అంబేద్క‌ర్ విగ్రహం(Ambedkar Statue) పెట్టగానే.. ప్రకాష్ అంబేద్క‌ర్(Prakash Ambedkar) కు కేసీఆర్ మంచివాడు అయిపోయాడు. అది తాను అంగీకరించనన్నారు. మేము అంబేద్క‌ర్ వారసులమే.. ఆయన ఆలోచనలకు మేమే వారసులం అని అన్నారు. కేసీఆర్ దళితులకు చేసిన అన్యాయం గురించి ప్రకాష్ అంబేద్క‌ర్ మాట్లాడాలన్నారు. మీరు కేసీఆర్ ను పొగడటం దళితులకు అవమానం.. దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Updated On 16 April 2023 5:02 AM GMT
Yagnik

Yagnik

Next Story