సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర(Peoples March Padayatra) మంచిర్యాలకు చేరిన సందర్భంగా.. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్‌ పట్టణంలో కాంగ్రెస్ సత్యాగ్రహ సభ(Satyagraha Sabha) నిర్వహించనుంది. సభా ప్రాంగణానికి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాంగణంగా నామకరణం చేశారు ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే హాజరవనున్నారు. ఈ […]

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర(Peoples March Padayatra) మంచిర్యాలకు చేరిన సందర్భంగా.. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్‌ పట్టణంలో కాంగ్రెస్ సత్యాగ్రహ సభ(Satyagraha Sabha) నిర్వహించనుంది. సభా ప్రాంగణానికి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాంగణంగా నామకరణం చేశారు

ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే హాజరవనున్నారు. ఈ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం.. నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ప్రజలను చైతన్యం చేసి సభ విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరింది. అందరూ చేయి చేయి కలిపి.. జన సమీకరణ చేసి మంచిర్యాలకు తరలిరావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

నస్పూర్‌ పట్టణంలోని కలెక్టరేట్‌ సమీకృత భవనం సమీపంలో ఈ సత్యాగ్రహ సభ జరుగుతుంది. ప్రజలు జాతీయ రహదారి విలేజ్‌ నస్పూర్‌ టర్నింగ్‌ వద్ద నుంచి సభాస్థలానికి చేరుకుంటారు. వీఐపీలు కలెక్టరేట్‌ కు వెళ్లే దారి నుంచి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి తాగునీటి వసతి కల్పించారు.

Updated On 13 April 2023 10:58 PM GMT
Yagnik

Yagnik

Next Story