కాంగ్రెస్‌ పార్టీ(Congrrss) విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ(PCC) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.సోనియాగాంధీకి(Sonia Gandhi) కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్‌ నాయకులకు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను అమలు చేయడానికి ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను మరింత పెంచారన్నారు.

ఈ డిసెంబరు 3న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో 21 రోజుల పాటు సాగింది. రాష్ట్ర ప్రజలకు ఏ కష్టమొచ్చిన అండగా ఉంటామని రాహుల్‌గాంధీ(Rahul gandhi) భరోసా ఇచ్చారు. నన్ను, భట్టి విక్రమార్కను(Batti Vikramarka) రాహుల్‌ ఎంతో ప్రోత్సహించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలకు(Priyanka Gandhi) తెలంగాణతో కుటుంబ అనుబంధం ఉంది. పార్టీ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావు(Hanumanth Rao) తదితర నేతల సహకారంతోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆచార్య కోదండరామ్‌ సలహాలు, సూచనలు తీసుకుని ముందకెళ్తాం. కాంగ్రెస్‌ గెలుపును ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్‌ గెలుపును కేటీఆర్‌ స్వాగతించారు. వారి స్పందనను స్వాగతిస్తున్నా. ప్రతిపక్ష పార్టీగా భారాస సహకరిస్తుందని ఆశిస్తున్నా. ఇక నుంచి ప్రగతి భవన్‌ ప్రజా భవన్‌ అవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యానికి మ‌ద్ద‌తు ప‌లికిన తెలంగాణ జ‌న స‌మితి నేత కోదండ‌రామ్‌, మిత్ర ప‌క్షం సీపీఐకి, సీపీఐ మాజీ రాజ్య‌స‌భ్యుడు అజీజ్ పాషాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ప్ర‌జా భ‌వ‌న్(Praja Bhavan) గా ప్ర‌గ‌తి భ‌వ‌న్(Pragathi bhavan) మారుతుందన్నారు. ఇక నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్ కాదు.. ప్ర‌జా భ‌వ‌న్‌.. అది ప్ర‌జ‌ల ఆస్తి.. ప్ర‌జ‌ల కోసం వినియోగిస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పారు. రేప‌టి భ‌విష్య‌త్ కోసం కాంగ్రెస్ పార్టీ సార‌ధ్యంలోని ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. 2004-14 మ‌ధ్య కాలంలో అందించిన ప్ర‌జా పాల‌న అందిస్తాం అని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు చేయాల‌ని బీఆర్ఎస్ నాయ‌క‌త్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, సోనియాగాంధీకి, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు, సోద‌రుడిగా అండ‌గా నిలిచిన‌, స్ఫూర్తి నిచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి, త‌న‌తో స‌మానంగా ప్ర‌చారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Updated On 3 Dec 2023 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story