కాంగ్రెస్‌ 16 మంది అభ్యర్థులతో కూడిన మూడవ జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కాంగ్రెస్‌(Congress) 16 మంది అభ్యర్థులతో కూడిన మూడవ జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. నల్గొండ(Nalgonda) జిల్లాలోని సూర్యాపేట(Suryapet), తుంగతుర్తి(Thungaturthi) స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).. కేసీఆర్‌పై కామారెడ్డి(Kamareddy) నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. దీంతో కామారెడ్డిలో ఆసక్తికర పోరు నెలకొంది. రేవంత్ కొండంగల్(Kodangal) నుంచి కూడా పోటీ చేయనున్నారు.

ఇటీవల బీజేపీ ప్రాథ‌మిక‌ సభ్యత్వానికి రాజీనామా చేసిన డాక్టర్ జి వివేకానంద్‌(G Vivekanand)కు కాంగ్రెస్‌ చెన్నూరు(Chennur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ కేటాయించింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) పోటీ చేస్తున్న సిరిసిల్ల(Siricilla) నుంచి కేకే మహేందర్‌రెడ్డి(KK Mahender Reddy)ని కాంగ్రెస్‌ మళ్లీ పోటీకి దింపింది. సీనియర్ నేత మహ్మద్ షబ్బీర్‌ అలీ(Shabbir Ali)ని నిజామాబాద్ అర్బన్‌(Nizamabad Urban)కు మార్చారు.

ఈ జాబితాలో బోథ్, వనపర్తి నియోజకవర్గాల్లో ఇద్దరి పేర్లు మారాయి. మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి, వన్నెల అశోక్ స్థానంలో తుడి మేఘారెడ్డి, అదే గజేందర్‌లను నియమించారు. పార్టీ సర్వేల ఆధారంగానే ఇది జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఇప్ప‌టివ‌ర‌కూ మూడు జాబితాల్లో 116 మంది అభ్యర్థులను ప్రకటించింది.. రెండు స్థానాలు పెండింగ్‌లో ఉండ‌గా.. కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన‌ ఏనుగు రవీందర్‌రెడ్డికి కూడా ఎల్లారెడ్డి నుంచి టికెట్‌ ఇచ్చారు.

Updated On 6 Nov 2023 9:31 PM GMT
Yagnik

Yagnik

Next Story