Rahul Gandhi at Medigadda barrage : లక్ష కోట్ల రూపాయల బ్యారేజీ రెండేళ్లలోనే దెబ్బతినడం దారుణం
కాంగ్రెస్(Comgress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ ఉదయం మేడిగడ్డ బ్యారేజీని(Medigadda barrage) పరిశీలనకు వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ ప్రాజెక్టు పరిశీలనకు రాహుల్‌కు పోలీసులు అనుమతిచ్చారు. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డకు రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు.
కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ ఉదయం మేడిగడ్డ బ్యారేజీని(Medigadda barrage) పరిశీలనకు వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ ప్రాజెక్టు పరిశీలనకు రాహుల్‌కు పోలీసులు అనుమతిచ్చారు. దీంతో జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలోని మేడిగడ్డకు రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. ఆపై ఆయన మేడిగడ్డ బ్యారేజీపరిశీలనకు వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను మాత్రమే ప్రాజెక్టు పరిశీలనకు అనుమతించారు.
ప్రాజెక్టు పరిశీలన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన బ్యారేజీ రెండేళ్లలోనే దెబ్బతినడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల దోపిడీ, నిర్మాణంలో అక్రమాల వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. దర్యాప్తు సంస్థల అధినేత అమిత్‌షా(Amit shah) అవినీతిపై మోదీ(PM Modi) చర్యలు తీసుకోలేదని రాహుల్ పేర్కొన్నారు. అనంతరం వచ్చిన విమానంలోనే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఇదిలావుంటే.. మేడి గడ్డ పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక పర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం మేడిగడ్డ సరిహద్దులోని అంబటి పల్లిలో జరిగిన మహిళా సదస్సులో రాహుల్ పాల్గొన్నారు.