ప్ర‌స్తుతం జ‌రిగే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లలో(Assembly Elections) కాంగ్రెస్(Congress) గెలుస్తుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నాకున్న సమాచరం మేరకు తెలంగాణాతో సహా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలవనుందని అన్నారు. ఆరు నెల‌ల క్రితం క‌ర్ణాట‌క(Karnataka) విజ‌యంతో కాంగ్రెస్‌కు ఒక ఊపు రాగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు.. కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో స్నేహంగా ఉన్న ఇండియా కూట‌మికి(INDIA Alliance) మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతాయి.

ప్ర‌స్తుతం జ‌రిగే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లలో(Assembly Elections) కాంగ్రెస్(Congress) గెలుస్తుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నాకున్న సమాచరం మేరకు తెలంగాణాతో సహా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలవనుందని అన్నారు. ఆరు నెల‌ల క్రితం క‌ర్ణాట‌క(Karnataka) విజ‌యంతో కాంగ్రెస్‌కు ఒక ఊపు రాగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు.. కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో స్నేహంగా ఉన్న ఇండియా కూట‌మికి(INDIA Alliance) మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతాయి. ఎన్నిక‌లు మూడు స్టెప్స్ అనుకుంటే.. క‌ర్ణాట‌క మొద‌టి స్టెప్‌.. జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రెండ‌వ స్టెప్‌, చివ‌రి స్టెప్ ఢిల్లీలో(Delhi) కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేయ‌డ‌మే.. అది చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌న్నారు. తెలంగాణ‌లో తానూ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లాన‌ని.. రానున్న రేపు, ఎల్లుండి లోపు మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్తాను. నాకున్న సమాచరం మేరకు తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ స్ప‌ష్ట‌మైన మెజార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు.

1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాననసభ్యుడిగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర రెడ్డి(Kotla Vijay Baskar Reddy) మంత్రివర్గంలో పశు సంవర్థక శాఖా మంత్రిగా పనిచేశారు. 1994 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 లో మరోసారి గెలుపొంది వై.ఎస్.రాజశేఖరరెడ్డి(YS Rajashekar Reddy) మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వై.ఎస్.ఆర్ మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. వై.ఎస్ మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన త‌ర్వాత ఏపీ పీసీసీ(APPCC) అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అనంత‌రం కొంత‌కాలం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో యాక్టివ్ అయ్యారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయ‌న‌ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా అవ‌కాశం క‌ల్పించింది.

Updated On 25 Nov 2023 5:00 AM GMT
Ehatv

Ehatv

Next Story