ఈ నెల 14వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌(Telangana Assembly Speaker) ఎన్నిక జరుగనుంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌(Assembly Secretariat) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పీకర్‌ పదవికి పోటీపడే వారి నుంచి ఈ నెల 13వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఈ నెల 14వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌(Telangana Assembly Speaker) ఎన్నిక జరుగనుంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌(Assembly Secretariat) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పీకర్‌ పదవికి పోటీపడే వారి నుంచి ఈ నెల 13వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు(Gaddam Prasad Kumar) స్పీకర్‌ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే కాంగ్రెస్‌ తరఫున ఒక్క నామినేషన్‌ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఇంకెవరైనా పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్‌ ఆధ్యర్యంలో స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది.

Updated On 11 Dec 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story