Telangana Secretariat : సచివాలయంలో కొలువుదీరిన కొత్త మంత్రులు- ఏ మంత్రికి ఎక్కడంటే..?
తెలంగాణ సచివాలయంలో(Telangana Secretariat) కొత్త మంత్రులు(Ministers) కొలువు దీరారు. సచివాలయంలో తమకు కేటాయించిన కార్యాలయాల్లో మంత్రులు పనులు మొదలు పెట్టారు. నూతనంగా నిర్మించిన బీఆర్అంబేద్కర్ సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

Telangana Secretariat
తెలంగాణ సచివాలయంలో(Telangana Secretariat) కొత్త మంత్రులు(Ministers) కొలువు దీరారు. సచివాలయంలో తమకు కేటాయించిన కార్యాలయాల్లో మంత్రులు పనులు మొదలు పెట్టారు. నూతనంగా నిర్మించిన బీఆర్అంబేద్కర్ సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. వీరికి గదులు కేటాయిస్తూ ఆదివారం సీఎస్ శాంతి కుమారి(CS Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఈ మంత్రులు ఎవరెవరు ఏ అంతస్తుల్లో… ఏ నెం. గదుల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం
సెకండ్ ఫ్లోర్: భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ, ఇంధన శాఖ (10, 11, 12 గదులు)
ఫోర్త్ ఫ్లోర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్, పౌర సరఫరాలు (27, 28, 29 గదులు)
సెకండ్ ఫ్లోర్: దామోదర రాజనర్సింహ వైద్యం, కుటుంబ సంక్షేమం (13, 14,15 గదులు)
ఫిఫ్త్ ఫ్లోర్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ (10, 11, 12 గదులు)
థర్డ్ ఫ్లోర్: శ్రీధర్ బాబు ఐటి, పరిశ్రమలు (10, 11, 12 గదులు)
గ్రౌండ్ ఫ్లోర్ః పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ (10, 11, 12 గదులు)
ఫోర్త్ ఫ్లోర్: పొన్నం ప్రభాకర్ ట్రాన్స్ పోర్ట్, బీసీ సంక్షేమ శాఖ (27, 28, 29 గదులు)
ఫోర్త్ ఫ్లోర్: కొండా సురేఖ అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ నాలుగవ (10, 11, 12 గదులు)
గ్రౌండ్ ఫ్లోర్: సీతక్క పిఆర్, ఆర్ డి, మహిళా శిశు సంక్షేమం (27, 28, 29 గదులు)
థర్డ్ ఫ్లోర్: తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం, మార్కెటింగ్, కో-ఆపరేటివ్ (27, 28, 29 గదులు)
ఫోర్త్ ఫ్లోర్: జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్, టూరిజం (13,14,15 గదులు)
