Nallala Odelu : సుమన్ నాకు రూ.20 కోట్లు ఆఫర్ చేశాడు
చెన్నూర్ ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్(BRS) అభ్యర్ధి బాల్క సుమన్‌పై(Suman) మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్(Congress) నాయకుడు నల్లాల ఓదెలు(Nallala Odelu) సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka suman) నాకు రూ.20 కోట్లు ఆఫర్ చేశాడని బాంబు పేల్చాడు.

Nallala Odelu
చెన్నూర్ ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్(BRS) అభ్యర్ధి బాల్క సుమన్‌పై(Suman) మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్(Congress) నాయకుడు నల్లాల ఓదెలు(Nallala Odelu) సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka suman) నాకు రూ.20 కోట్లు ఆఫర్ చేశాడని బాంబు పేల్చాడు. సుమన్ కు ఓటమి భయం పట్టుకుంది.. నన్ను కొనాలని చూస్తున్నాడని అన్నారు. నాకు రూ. 20 కోట్లు కాదు కదా రూ.100 కోట్లు ఇచ్చినా వివేక్(Vivek) ను వీడనని స్పష్టం చేశారు. ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బాల్క సుమన్ ను బట్టలూడతీసి ఇంటికి పంపిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్టని ఓదెలు వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. ఓదేలు బీఆర్ఎస్ తరపున చెన్నూర్ టికెట్ ఆశించారు. అయితే కేసీఆర్ మాత్రం సిట్టింగ్‌ల వైపే మొగ్గు చూపారు. దీంతో ఓదేలు కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. బీజేపీ నుంచి వచ్చిన వివేక్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అయితే ఓదేలును మాత్రం అధిష్టానం బుజ్జగించింది. దీంతో వివేక్ గెలుపును భుజాన వేసుకున్న ఓదేలు.. సుమన్‌పై తనదైన స్టైల్లో విరుచుకుపడుతున్నారు.
