తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్ ఎల్పీ సమావేశం నిర్వహిస్తుంది.
తెలంగాణ ఎన్నికల(Telangana Elections)లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్ ఎల్పీ సమావేశం(CLP Meeting) నిర్వహిస్తుంది. ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలి(Gachibowli)లోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ భేటీ ఉంటుంది. దీంతో నూతనంగా గెలచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హోటల్ ఎల్లాకు చేరుకున్నారు. ఎల్లా హోటల్ పరిసర ప్రాంతాల్లో పోలీసు అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక ఉంటుంది. ఈ సమావేశానికి పరిశీలకులకులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar), జార్జ్(George), దీపా దాస్ మున్షి(Deepa Das Munshi), అజయ్(Ajay), మురళీధరన్(Muralidharan) ఉంటారని ఏఐసీసీ(AICC) పేర్కొంది. సీఎల్పీ భేటీ అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.