తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాటలు, చేష్టలు ఆమెకు చేటు తెస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధిష్టానానికి సురేఖపై ఫిర్యాదు చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాటలు, చేష్టలు ఆమెకు చేటు తెస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధిష్టానానికి సురేఖపై ఫిర్యాదు చేశారు. సర్ది చెప్పడానికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్(PCC Mahesh Kumar) ప్రయత్నిస్తున్నారు కానీ నేతలు వినడం లేదు. ఇదిలా ఉంటే వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Warangal Congress MlA) రేపు ఢిల్లీ(Delhi)కి వెళుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC Venugopal)అపాయింట్‌మెంట్‌ను ఎమ్మెల్యేలు కోరారు. వారు ఢిల్లీకి వెళుతున్నది మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికే! రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ(Deepadas Munshi), రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌లకు ఇప్పటికే వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే గరం అవుతున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.