☰
✕
Naini Rajender : కౌశిక్ రెడ్డికి డ్రగ్స్ అలవాటు.. ఆయనకు నార్కోటిక్ పరీక్షలు చేయించాలి
By Sreedhar RaoPublished on 15 Sep 2024 3:38 AM GMT
హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు
x
హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి డ్రగ్స్‌కు అలవాటు పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. అతనికి నార్కోటిక్ పరీక్షలు చేయించాలన్నారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టడం కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని.. అతడిని సాంఘిక బహిష్కరణ చేయాలన్నారు. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు.. మీకు సిగ్గు శరం లేవా అని మండిపడ్డారు. మేము కూఆడ మీలా చేయాలనుకుంటే.. ఊళ్లలో తిరగలేరు జాగ్రత్త అని హెచ్చరించారు. గాజులు, చీరలు చూపడం కాదు.. కట్టుకొని తిరగండని కౌంటర్ ఇచ్చారు.
Sreedhar Rao
Next Story