తెలంగాణ అసెంబ్లీ(Telangana assembly) పరువు మంటకలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ(Telangana assembly) పరువు మంటకలుస్తోంది. శుక్రవారం కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన దానం నాగేందర్(dhanam nagendra) ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. నీ అమ్మ, తోలుతీస్తా, బయట తిరగనియ్య, ఏమనుకుంటున్నారు రా అంటూ చెలరేగిపోయారు. బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలను బెదిరించారు. హైదరాబాద్‌లో తిరగనియ్యనంటూ రౌడి భాష మాట్లాడారు. చిత్రమేమిటంటే దానం ఈ బూతులు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్(speaker) కలగచేసుకోకపోవడం. దానం నాగేందర్ బూతులు మాట్లాడినట్టు తేలితే రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారంతే! అంటే దానం మాట్లాడినవి బూతులు కావా? అవి బూతులు అని ఎవరు తేల్చాలి? అసెంబ్లీలో నీ అమ్మ అని మాట్లాడటం సరికాదని, జనాలకు రాంగ్ మెసేజ్ వెళుతుందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్(akbaruddin) ఓవైసీ(Owaisi) చెప్పినా దానం లైట్ తీసుకున్నారు. పైగా వైరి పక్షం రెచ్చగొట్టబట్టే తాను అలా మాట్లాడానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నీ అమ్మ, మా అమ్మ అనేది బూతు కాదు సంస్కారవంతమైన భాష అని దానం కొత్త భాష్యం చెప్పారు.