Congress Prajabheri Sabha : 31న కొల్లాపూర్లో కాంగ్రెస్ పాలమూరు ప్రజాభేరి సభ
ఈ నెల 31న కొల్లాపూర్(Kollapur) లో పాలమూరు ప్రజా భేరి సభ(Prajabheri sabha) నిర్వహించనున్నట్లు కాంగ్రెస్(Congress) సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. ఏఐసీసీ అగ్ర నేత ప్రియాంక గాంధీ పాలమూరు ప్రజా భేరి సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలియజేశారు.

Congress Prajabheri Sabha
ఈ నెల 31న కొల్లాపూర్(Kollapur) లో పాలమూరు ప్రజా భేరి సభ(Prajabheri sabha) నిర్వహించనున్నట్లు కాంగ్రెస్(Congress) సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. ఏఐసీసీ అగ్ర నేత ప్రియాంక గాంధీ పాలమూరు ప్రజా భేరి సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలియజేశారు. సభా ఏర్పాట్లపై టీపీసీసీ(TPCC) ఉపాధ్యక్షుడు మల్లు రవి నివాసంలో జూపల్లి కృష్ణా రావు(Jupally Krishna Rao), జగదీశ్ రావ్(Jagadish Rao), ప్రతాప్ గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజాకంఠక కేసీఆర్ పాలనకు ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. పాలమూరు ప్రజా భేరి సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
