ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి అప్పగించింది. జూలై 2న అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి పొంగులేటికి కాంగ్రెస్‌లో ఏ పదవికి అప్పగిస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల కాంగ్రెస్(Congress) తీర్థం పుచ్చుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy)కి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి అప్పగించింది. జూలై 2న అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి పొంగులేటికి కాంగ్రెస్‌లో ఏ పదవి(Post)కి అప్పగిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పార్టీలో కీలక పదవిని అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.
టీపీసీసీ ప్రచార కమిటీ కో ఛైర్మన్(TPCC Campaigning Committee Co-Chairman)గా పొంగులేటి(Ponguleti)ని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం(Congress HighCommand). మధుయాస్కీ గౌడ్(Madhuyaski Goud) టీపీసీసీ ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇప్పుడు పొంగులేటిని కో ఛైర్మన్‌గా నియమించింది. పొంగులేటితో పాటు 37 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ(Executive Committee)ని ప్రకటించిన అధిష్టానం.. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు(TPCC Chief), సీఎల్పీ లీడర్(CLP Leader), ఎంపీలు(MPs), ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలు(MLCs), డీసీసీ అధ్యక్షుల(DCC Presidents)ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal) ప్రకటన విడుదల చేశారు.
.