నేడు ముంపు ప్రాంతాలలో పర్యటించనున్న కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉప్పల్, ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజక వర్గాలలో పర్యటించనున్నారు.

Congress leaders will visit flooded areas today
కాంగ్రెస్ నేతలు(Congress Leaders) నేడు ముంపు ప్రాంతాలలో పర్యటించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉప్పల్(Uppal), ఎల్బీ నగర్(LB Nagar) అసెంబ్లీ నియోజక వర్గాలలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉప్పల్ నియోజకవర్గంలో, మద్యాహ్నం 1 గంటకు ఎల్బీనగర్ నియోజక వర్గంలో పర్యటించి వరద ప్రాంతాలను పరిశీలిస్తారు. ముంపు ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడుతారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Podem Veeraiah) భద్రాచలం నియోజకవర్గం ముంపు ప్రాంతాలలో ఈరోజు పర్యటిస్తారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు భద్రాచలం(Bhadrachalam) పట్టణం కరకట్ట మీద నుండి అశోక్ నగర్(Ashok Nagar) కొత్త కాలనీ సందర్శించి.. తర్వాత గోదావరి కరకట్టపై స్లూయిజ్ వాళ్లు, విస్తా కాంప్లెక్స్ గోదావరి నది ప్రవాహం లాకులు వాటి యొక్క వివరాల గురించి ముంపు ప్రజలను అడిగి తెలుసుకుని, పునరావాస కేంద్రాలు సందర్శిస్తారు. తరువాత దుమ్ముగూడెం(Dummugudem) మండలం సున్నంబట్టి(Sunnambatti) గ్రామంను సందర్శించి మంగువయిబాడవాలో పునరావాస కేంద్రాలను సందర్శించనున్నారు.
