గాంధీ భవన్‌లో(Gandhi bhavan) కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్(Congress) పార్టీ సత్యాగ్రహ మౌన దీక్ష(Satyagraha silence initiation) ప్రారంభమైంది. బీజేపీ(BJP), కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై(Rahul Gandhi) చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు దీక్ష చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Satyagraha silence initiation
గాంధీ భవన్‌లో(Gandhi bhavan) కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్(Congress) పార్టీ సత్యాగ్రహ మౌన దీక్ష(Satyagraha silence initiation) ప్రారంభమైంది. బీజేపీ(BJP), కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై(Rahul Gandhi) చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు దీక్ష చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహశ్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నాయకులు కోదండరెడ్డి, సునీతా రావ్ తదితరులు సత్యాగ్రహ మౌన దీక్షలో పాల్గొన్నారు.
సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్(BRS) అనవసర రాద్దాంతం చేస్తుందని.. రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని నేతలు అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు చేసి, అనంతరం సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో విద్యుత్ సంస్థలను రూ.60వేల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు సీఎం కేసీఆర్ అని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు అని మండిపడ్డారు.
