కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) అవినీతిపై కాంగ్రెస్ పార్టీ(Congress) వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్(CM KCR), బీఆర్ఎస్(BRS) పార్టీ అవినీతిని ఎండగడుతూ ప్రత్యేక కాళేశ్వరం ఏటీఎం ను ఆవిష్కరించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) అవినీతిపై కాంగ్రెస్ పార్టీ(Congress) వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్(CM KCR), బీఆర్ఎస్(BRS) పార్టీ అవినీతిని ఎండగడుతూ ప్రత్యేక కాళేశ్వరం ఏటీఎం ను ఆవిష్కరించింది. ఈ ఏటీఎంలను హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు చురుకుగా తెలియజేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇటీవల పిల్లర్లు కుంగిపోయాయి. లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిన నాలుగు సంవత్సరాలకే పిల్లర్లు కుంగిపోవడంపై ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్(KCR) కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలు అనేక సార్లు విమర్శించారు.

లక్ష కోట్ల రూపాయల అవినీతిని ఎత్తిచూపేలా, ఏటీఎం నుండి లక్ష కోట్ల రూపాయల నోటు బయటికి రావడం అందరినీ ఆకర్షిస్తోంది. ఏటీఎంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao), ఎంపీ సంతోష్ రావు ఫొటోలు పొందుపరిచారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

Updated On 31 Oct 2023 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story