కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బీ స్టేడియం(LB Stadium)లో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బీ స్టేడియం(LB Stadium)లో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేశారు.
అంతకుముందు సోనియా గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి పూలతో అలంకరించిన వాహనంపై ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు ప్రమాణ స్వీకారం సమయంలో వేదికపై ఆశీనులయ్యారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు తిరుగుపయనమయ్యారు.