బీ ఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్(Working Presidant) మాజీ మంత్రి కేటీఆర్(KTR) ను సుదీర్ఘకాలం జైలులో(Jail) ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

బీ ఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్(Working Presidant) మాజీ మంత్రి కేటీఆర్(KTR) ను సుదీర్ఘకాలం జైలులో(Jail) ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మంత్రుల మాటలు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సిఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలు దీనికి సంకేతం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆశ్చర్యమేమిటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్‌(Bandi sanjay), ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నోటి నుంచి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు రావడం. కేటీఆర్‌ ప్రతి అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గత ప్రభుత్వం పై నెపం నెట్టేయటానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. వెంటనే కేసీఆర్ హయం లో ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందంటూ కరెక్ట్ లెక్కలతో బీ ఆర్ ఎస్ కూడా ఒక శ్వేత పత్రం రిలీజ్ చేసింది. అలాగే మూసీ(Musi), హైడ్రా(Hydra) దాకా, సుంకిశాల, కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, అమృత్‌ స్కీమ్‌ దాకా ప్రతి అంశంలో కేటీఆర్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రజలు కేటీఆర్ వెంట ఉండటాన్ని ప్రభుత్వ పెద్దలు భరించలేకపోతున్నారు. దీనిని నిలువరించాలంటే కేటీఆర్ ను అరెస్టు చేయడం ఒక్కటే మార్గమని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారట!

అందులో భాగంగానే పద్ధతి ప్రకారం ముందుగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. అనుకూల మీడియాతో అవి నిజమే కాబోలు అన్నంతగా ప్రచారం చేయిస్తున్నారు. కనీసం ఆరేడు అంశాల్లో కేటీఆర్‌ పేరును ప్రస్తావిస్తున్నారు. దానికి ఆయనే బాధ్యుడంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది. ఫోన్‌ట్యాపింగ్‌, ఫార్ములా ఈ-రేస్‌, ధరణిలో అక్రమాలు, ఔటర్‌రింగ్‌రోడ్‌ టెండర్లు.. ఇలా అనేక అంశాలను తెర మీదకు తెస్తున్నారు. వీటికి.కేటీఆర్‌ మూ ల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్(Congress) పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. దీపావళి కంటే ముందే పొలిటికల్‌ బాంబు పేలుబోతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti srinivas) సియోల్‌ వేదికగా ఒక వ్యాఖ్య చేశారు. దీపావళి వెళ్ళిపోయింది. కార్తీక పౌర్ణమి కూడా అయిపోయింది. బాంబ్ పేలలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సమయం కోసం ఇంకా వేచిచూస్తున్నదని అనుకోవాలి.

పొంగులేటి అలా అన్నారో లేదో ఫార్ములా ఈ-రేస్‌(Formula E race) తెరపైకి వచ్చింది. ఆ వెంటనే ఏసీబీ(ACB) రంగంలోకి దిగటం, కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్‌ అనుమతి కోసం లేఖ రాయటం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇంతలో లగచర్ల ఘటన ప్రభుత్వానికి చేతికందిన అస్త్రంలా దొరికింది. లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టుచేసిన ప్రభుత్వం పనిలోపనిగా ఆయన రిమాండ్‌ రిపోర్టులో కేటీఆర్‌ పేరును ఇరికించింది. దీనిని అడ్డంపెట్టుకొని కేటీఆర్‌ను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చునని టాక్ నడుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story