శుక్రవారం అంతా బీఆర్‌ఎస్‌(BRS) విలీన వార్తలే మీడియాలో మారుమోగాయి.

శుక్రవారం అంతా బీఆర్‌ఎస్‌(BRS) విలీన వార్తలే మీడియాలో మారుమోగాయి. త్వరలో బీజేపీలో(BJP) బీఆర్‌ఎస్‌(BRS) విలీనం కావడం ఖాయమని కాంగ్రెస్‌ పార్టీ చెప్పిందే చెబుతూ వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) కొంచెం ముందుకెళ్లి పదవుల చిట్టా కూడా చెప్పారు. బీజేపీ గమ్మున ఉండదు కదా! అబ్బే బీఆర్‌ఎస్‌ విలీనమయ్యేది కాంగ్రెస్‌లోనేనని బండి సంజయ్‌(Bandi sanjay) చెప్పుకొచ్చారు. ఆయన కూడా పదవుల లిస్టు చెప్పారు. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ విలీనంపై మాట్లాడుతుంటే అసలైన నాయకుడు కేసీఆర్‌(KCR) మాత్రం ఇంకా పెదవి విప్పడం లేదు. ఇదే మాటలను కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి(Vijayashanti) కూడా అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పందించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఇందుకు సంబంధించి ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు.

'బీఆరెస్ పార్టీ బీజేపీల విలీనం అయితన్నది అన్న వ్యాఖ్యానాలు కాంగ్రెస్ నుండి... బీఆరెస్ కాంగ్రెస్‌ల విలీనం కానున్నది అన్న వ్యాఖ్యానాలు బీజేపీ నుండి, ఇట్లా రెండు జాతీయ పార్టీల రాష్ట్ర ముఖ్య నేతల ప్రకటనలు వచ్చిన దృష్ట్యా .... సమాధానం చెప్పవలసిన సందర్భం, బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ గారి బాధ్యతగా కనపడుతున్నది.

మిగతా నేతల విమర్శ, ప్రతివిమర్శలు ఎట్లా ఉన్నప్పటికీ, కేసీఆర్ గారి జవాబు ఈ పై పరిణామాలల్ల తప్పక అవసరం. ఆ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు.

హర హర మహాదేవ్

జై తెలంగాణ

విజయశాంతి' అంటూ విజయశాంతి ట్వీట్‌ చేశారు.

మరి విజయశాంతి పోస్టుకు కేసీఆర్‌ రియాక్టవుతారా లేదా అన్నది చూడాలి.




Updated On 17 Aug 2024 3:49 AM GMT
Eha Tv

Eha Tv

Next Story