కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి(Renuka Chowdary) ఖమ్మం(Khammam)లో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభకు తన ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఖమ్మం నగరంలోని కరుణగిరి వద్ద రేణుక చౌదరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బారికేడ్లను నెట్టుకుని నేరుగా ఖమ్మం సభా ప్రాంగణానికి వెళ్లిపోయారు. ఖమ్మం సభకు బీఆర్ఎస్ ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి(Renuka Chowdary) ఖమ్మం(Khammam)లో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభ(Congress Janagarjana Sabha)కు తన ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఖమ్మం నగరంలోని కరుణగిరి వద్ద రేణుక చౌదరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బారికేడ్లను నెట్టుకుని నేరుగా ఖమ్మం సభా ప్రాంగణానికి వెళ్లిపోయారు. ఖమ్మం సభకు బీఆర్ఎస్ ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామనే భయంతో మా సభను ప్రభుత్వం అడ్డుకుంటోంది. రోడ్లపై బారికేడ్లు పెడితే భయపడతామా? మా జాతకాల్లో భయాల్లేవు. ఎవడబ్బ సొమ్మని పెడుతున్నారు? పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు. ఎవడ్రా మమ్మల్ని ఆపేది? ' అని ఫైర్ అయ్యారు. ఇవాల్టి సభ ట్రైలరేనని, ముందు ముందు సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు.