ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర‌య్యారు. కేటీఆర్ కు బుడ్లు, బెడ్లు, దుడ్లు తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు వ్యవసాయం గురించి ఏమి తెలియ‌ద‌ని అన్నారు. సోమ‌వారం ఆయ‌న గాంధీ భ‌వ‌న్‌లో మాట్లాడుతూ.. 2004, 2009 లో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ తీసుకోలేదని గుర్తుచేశారు. జగిత్యాల జిల్లాకు ఇరిగేషన్ పరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని అన్నారు.

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర‌య్యారు. కేటీఆర్ కు బుడ్లు, బెడ్లు, దుడ్లు తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు వ్యవసాయం గురించి ఏమి తెలియ‌ద‌ని అన్నారు. సోమ‌వారం ఆయ‌న గాంధీ భ‌వ‌న్‌లో మాట్లాడుతూ.. 2004, 2009 లో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ తీసుకోలేదని గుర్తుచేశారు. జగిత్యాల జిల్లాకు ఇరిగేషన్ పరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని అన్నారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు.

శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని తెలియ‌జేశారు. కాంగ్రెస్ పార్టీని చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు. రైతు వేదికల ద్వారా రైతు రుణ మాఫీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని సూచించారు. తెలంగాణలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా పోయిందని అప‌హ‌నం వ్య‌క్తం చేశారు. మూడు పంటలు పండటానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అన్న స్థితి నుండి వ్యవసాయం పండుగ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని వివ‌రించారు.

ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఘనత అని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక విద్యుత్ ఉత్పాదన ఎక్కడ పెరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్స్ వద్ద లాగ్ బుక్స్ ఎందుకు దాచి పెడుతున్నారని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి లిక్కర్ మీద వున్న శ్రద్ధ వ్యవసాయం మీద లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క చెరువును తవ్వలేదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞం కు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని వెల్ల‌డించారు. తెలంగాణలో 36 నీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని అన్నారు. రైతు వేదికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలని సూచించారు.

Updated On 17 July 2023 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story