ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. ఎన్నికలై ఆరు నెలల అయిందని.. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలు వ్యక్తిగతమా..? బీజేపీ పార్టీ చేసిన ఆరోపణలా.? చెప్పాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి.. కాంగ్రెస్ కు రూ.25 కోట్లు కేసీఆర్ ఇస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీలో చేరికలు లేక ఈటెల ఆవేదనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈటెల రాజేందర్(Etela Rajender) కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi) పేర్కొన్నారు. ఎన్నికలై ఆరు నెలల అయిందని.. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలు వ్యక్తిగతమా..? బీజేపీ(BJP) పార్టీ చేసిన ఆరోపణలా.? చెప్పాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి.. కాంగ్రెస్ కు రూ.25 కోట్లు కేసీఆర్(KCR) ఇస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీలో చేరికలు లేక ఈటెల ఆవేదనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembley Elections) బీజేపీ ఓటమి ఖాయమైందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక(Munugode Bypoll)ల్లో నేను పోటీ చేస్తే నాకు అనేక అవరోధాలు కల్పించారని వాపోయారు.
మునుగోడు ఉప ఎన్నిక.. కాంగ్రెస్ నేతను కొనుక్కొని బీజేపీ తీసుకువచ్చిందని అన్నారు. బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదన్నారు. ఈటెల రాజేందర్ తన రాజకీయ అనుభవాన్ని ఇలాంటి విమర్శలకు ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాకు కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాని(Bhagyalaxmi Temple)కి వెళ్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కొనే వాడు పుట్టలేదని అన్నారు. ఆదానీ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు రాహుల్ గాంధీ(Rahul Gndhi)పై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. ఈటెల భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి రాకపోతే.. వారి మానసిక స్థితి బాగోలేక బీజేపీలో ప్రాధాన్యత లేక.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని భావించాల్సివుంటదని అన్నారు. బీజేపీ నమ్మే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి ఈటెల రాజేందర్ రావాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు ఈటెల స్పందించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత(Kalva Sujatha) డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు సోషల్ మీడియా(Social Media)కు పరిమితం అయ్యారని సెటైర్లు విసిరారు. బీజేపీ ఆటలు నడవడానికి ఇది నార్త్ ఇండియా(North India) కాదు.. సౌత్ ఇండియా(South India) అని గుర్తుచేశారు. బీజేపీలోకి వెళ్ళాక ఈటెల రాజేందర్ మనస్తత్వం మారిపోయిందన్నారు. తెలంగాణ(Telangana) ఉద్యమ కారుడిగా ఈటెల నైతికత ఎక్కడికి పోయిందని దుయ్యబట్టారు. బీజేపీలో ప్రాధాన్యత లేక ఈటెల కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు బండి సంజయ్(Bandi Sanjay), ఈటెల, డి.కె అరుణ(DK Aruna) భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి రావాలని.. ఆరోపణలను నిరూపించకపోతే ఈటెల ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.