యుద్దానికి ఇక వంద రోజులే ఉందని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్(Congress) స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) అన్నారు. ఈ యుద్ధంలో ప్రజలు గెలవాలని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. త్వరలో బస్ యాత్ర ఉంటుందని.. పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నెల 30న ప్రియాంక సభ ఉంటుందని.. మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు.

Komati Reddy

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని.. ధరణి(Dharani) తెచ్చి పేదల భూములు లాక్కున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్(KCR) మోసాలు ప్రజలు గమనించారని అన్నారు. కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరు బాగుపడలేదని విమర్శించారు. మా మాటలు అన్ని చెబితే కేసీఆర్ ఈ రోజే ప్రగతి భవన్ ఖాళీ చేస్తారని అన్నారు. కేసీఆర్ దమ్ముంటే నీ తర్వాత బీసీని సీఎం చేస్తానని ప్రకటించు అని సవాల్ విసిరారు.
బీసీలకు(BC) న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. తలసాని ఓ విగ్గురాజ్.. ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్ ను ఒక్కటి అంటే.. ఆయన వంద అంటాడని అన్నారు. 24 గంటల కరెంట్ పై కేసీఆర్ మోసం చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు.