కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి సినిమా కార్యాలయాన్ని ఉగాది పర్వదినోత్సం సందర్భంగా ప్రారంభించనున్నారు.

కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి సినిమా కార్యాలయాన్ని ఉగాది పర్వదినోత్సం సందర్భంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆయన ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమాలో నటిస్తున్నారు. ఉగాదిని పురస్కరించుకుని రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. జయలక్ష్మి ఫిలిమ్స్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నారు జగ్గారెడ్డి. స్వయంగా జగ్గారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణ పనులను ఈ కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఉగాది నాటికి షూటింగ్ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా గురించి జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందులోని లవ్ స్టోరీకి తన పాత్రకు సంబంధం ఉండదని, తన పాత్ర ఇంటర్వెల్ కంటే ముందు ప్రారంభమై చివరి వరకు ఉంటుందన్నారు. తాన రాజకీయ జీవితం, విద్యార్థి దశ, నేత స్థాయి నుంచి కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా ఎలా ఎదిగిందీ ఈ సినిమాలో చూపించనున్నట్టు పేర్కొన్నారు. లవ్, ఫ్యాక్షన్, ఎమోషనల్, పొలిటికల్ డ్రామాగా ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా ఉంటుందని ఆయన వివరించారు.
