యాభై రోజుల కాంగ్రెస్ పాలనలో మహిళలకు విశ్వాసం పెరిగిందని సినీ నటి దివ్య వాణి అన్నారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..

Congress Leader Divyavani Comments Telangana Govt
యాభై రోజుల కాంగ్రెస్(Congress) పాలనలో మహిళలకు విశ్వాసం పెరిగిందని సినీ నటి దివ్య వాణి(Divyavani) అన్నారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం వల్ల పది కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారని తెలిపారు. ప్రగతి భవన్(Pragathi Bhavan) ను ప్రజా భవన్(Praja Bhavan) చేశారు. రాజకీయ విలువలు పెంచేలా కేసిఆర్(KCR) అనారోగ్యంతో ఉన్నప్పుడు సీఎం వెళ్లి పరామర్శించారని పేర్కొన్నారు. ఏపీసీసీ అధ్యక్షులుగా షర్మిల(Sharmila) నియామకం అవ్వడం శుభసూచికం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నూతన ఉత్సాహం తో పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.
