కాంగ్రెస్ బలపడుతుందనే భయం బీజేపీ నేతల్లో కనిపిస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు ఏకమయ్యి పోరాడాల్సిన పరిస్థితి నుంచి.. విచ్ఛినం అయ్యే పరిస్థితి తీసుకొచ్చారని విచారం వ్య‌క్తం చేశారు. చేరికలు లేకనే ఈటెల ఫ్రస్టేషన్ అవుతున్నారని.. ఈటెల అవగాహన లేమితో ప్ర‌స్టేషన్ తో చేసిన వాఖ్యలుగా అనుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు.

కాంగ్రెస్(Congress) బలపడుతుందనే భయం బీజేపీ(BJP) నేతల్లో కనిపిస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్(Addanki Dayakar) అన్నారు. గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు ఏకమయ్యి పోరాడాల్సిన పరిస్థితి నుంచి.. విచ్ఛినం అయ్యే పరిస్థితి తీసుకొచ్చారని విచారం వ్య‌క్తం చేశారు. చేరికలు లేకనే ఈటెల ఫ్రస్టేషన్ అవుతున్నారని.. ఈటెల(Etela Rajender) అవగాహన లేమితో ప్ర‌స్టేషన్ తో చేసిన వాఖ్యలుగా అనుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. ఢాంబికాలు చెప్పుకుని ఈటెల బీజేపీలో చేరాడని విమ‌ర్శించారు. రూ.18 వేల కోట్లు పెట్టి కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)ని కొన్నారని ఆరోపించారు.

ఈటెల ఆరోపణలు నిజమైతే.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) సవాల్ ను స్వీకరించాలన్నారు. దమ్ముంటే ఈటెల భాగ్యలక్ష్మి(Bhagyalaxmi Temple) ఆలయం వచ్చి ప్రమాణం చేయాలని స‌వాల్ విసిరారు. బుల్డోజర్ పెట్టి లేపినా బీజేపీ లేవదని ఎద్దేవా చేశారు. మోదీ(Narendra Modi), అమిత్ షా‌(Amith Shah) దగ్గర మార్కులు కొట్టేందుకే ఈటెల ఆరోపణలు చేస్తున్నార‌ని అన్నారు. చర్చ కోసం ఈటెల తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు. బీజేపీని లేపడానికి కేసీఆర్ పనిగట్టుకుని పనిచేస్తున్నారని.. ఓట్లు చీల్చేందుకు కేసీఆర్(KCR) బీజేపీ కు హైప్ ఇస్తున్నాడని అన్నారు.

బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పై పోరాడాలని అన్నారు. సహారా కుంభకోణం(Sahara Scam)లో కేసీఆర్ పై ఎందుకు కేసు కొట్టేసారని ప్ర‌శ్నించారు. మిషన్ కాకతీయ(Mission Kakatiya), మిషన్ భగీరథ(Mission Bhagiratha)లో జరిగిన అవినీతి పై బీజేపీ స్టాండ్ ఏంటని నిల‌దీశారు. రూ.18 వేల కోట్లు వచ్చాయని రాజగోపాల్ రెడ్డి తానే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ ఎందుకు తీసుకుందని ప్ర‌శ్నించారు.

కర్ణాటకలో జేడీఎస్(JDS), ఎంఐఎం(AIMIM) కలయిక వెనక బీజేపీ, బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. ఈటెల ఛీపెస్ట్ పొలిటీషియన్ అని తీవ్ర‌స్థాయ‌లో ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఈటెల.. రేవంత్ రెడ్డి తో సంప్రదింపులు జరిపారని అన్నారు. వ్యాపారాలు కాపాడుకోవడానికి ఈటెల బీజేపీలోకి పోయార‌ని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatreddy) కాంగ్రెస్ లోనే ఉంటార‌ని.. రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని అన్నారు. ఈటెల భాగ్యలక్ష్మి టెంపుల్ కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు.

Updated On 22 April 2023 1:42 AM GMT
Yagnik

Yagnik

Next Story