Barrelakka : బర్రెలక్క వెనుక కాంగ్రెస్ ముఖ్య నేత? కారణమేంటి?
తెలంగాణ ఎన్నికల(Telangana Elections 2023) రణక్షేత్రంలో పార్టీల రణగొణధ్వనుల మధ్య ఓ సన్నటి గొంతుక వేస్తున్న ప్రశ్నలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ గొంతుక సామాజిక మాధ్యమాలలో బర్రెలక్క(Barrelakka)గా ఎప్పుడో ప్రాచుర్యం పొందిన కర్నె శిరీషది! ఆమె ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నది. ఆమె మార్పును కోరుకుంటున్నది. చదివిన చదువుకు సార్థకతను అడుగుతున్నది. నిరుద్యోగాన్ని రూపుమాపమంటున్నది. ప్రభుత్వ ఆసుపత్రి కావాలంటున్నది. ఇవేమీ గొంతెమ్మ కోరకలు కావు. నిజానికి ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన పనులివి! ఇవేవీ ఈ పదేళ్లలో నెరవేరలేదు […]
తెలంగాణ ఎన్నికల(Telangana Elections 2023) రణక్షేత్రంలో పార్టీల రణగొణధ్వనుల మధ్య ఓ సన్నటి గొంతుక వేస్తున్న ప్రశ్నలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ గొంతుక సామాజిక మాధ్యమాలలో బర్రెలక్క(Barrelakka)గా ఎప్పుడో ప్రాచుర్యం పొందిన కర్నె శిరీషది! ఆమె ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నది. ఆమె మార్పును కోరుకుంటున్నది. చదివిన చదువుకు సార్థకతను అడుగుతున్నది. నిరుద్యోగాన్ని రూపుమాపమంటున్నది. ప్రభుత్వ ఆసుపత్రి కావాలంటున్నది. ఇవేమీ గొంతెమ్మ కోరకలు కావు. నిజానికి ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన పనులివి! ఇవేవీ ఈ పదేళ్లలో నెరవేరలేదు కాబట్టే ఆమె ఎన్నికల బరిలో దిగింది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తూ ప్రధానపార్టీలకు సవాల్ విసురుతున్నది. ఇప్పటికే ఆమెకు బోల్డంత మద్దతు లభించింది. నిరుద్యోగులు ఆమె వెంటే ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె పక్షాన నిలిచారు. జర్నలిస్టు సంఘాలు కూడా ఆమెకు మద్దతు పలికాయి. ఈమెకు లభిస్తున్న అనూహ్య మద్దతు ప్రధాన పార్టీలలో వణుకు పుట్టిస్తున్నది. ఇక్కడి నుంచి అధికార బీఆర్‌ఎస్(BRS) తరఫున బీరం హర్షవర్ధన్ రెడ్డి(Beeram Harshavardhan Reddy) బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) నుంచి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) పోటీ పడుతున్నారు. కమలం గుర్తుపై సుధాకర్‌రావు పోటీలో ఉన్నారు. ఇప్పుడు కర్నే శిరీషకు ఇంతటి మద్దతు లభిస్తున్నదంటే కచ్చితంగా తెర వెనుక ఎవరో ఒకరు ఉండి ఉండాలి. శిరీషను కనబడని చేయి ఏదో నడిపిస్తున్నదని అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడు శిరీషకు సంపూర్ణ మద్దతు ప్రకటించారట! ఆ యువతికి ఆర్ధికంగా చేయూతనందిస్తున్నారట! ఆమెకు ఎంత పాపులారిటీ లభిస్తే ఆ కాంగ్రెస్ నేతకు అంత లాభం! అదేమిటీ కాంగ్రెస్ నేత బర్రెలక్కకు ఎందుకు సపోర్ట్ చేస్తారనే అనుమానం వచ్చింది కదూ! ఈ మద్దతు వెనుక ఆ నేత దూరాలోచన, దురాలోచన ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. రాజకీయాలలో అపార అనుభవం కలిగిన నేత! రెండుసార్లు మంత్రిగా కూడా పని చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పేరుపొందిన రాజకీయ నాయకుడు. ఆయన గెలిస్తే జిల్లాలో మరింత పవర్‌ఫుల్ అవుతారు. ఇది ఆ ప్రముఖ నేతకు ఇష్టం లేదు. తాను ఉండగా జిల్లాలో మరో వ్యక్తి ఎదగకూడదన్నది సదరు నేత స్థిరాభిప్రాయం. అందుకే బర్రెలక్కకు బాసటగా నిలుస్తున్నాడు. బర్రెలక్కకు పడే ఓట్లన్ని ప్రజా వ్యతిరేకత ఉన్న ఓట్లే!సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్‌పార్టీకి పడాల్సిన కొన్ని ఓట్లు బర్రెలమ్మ ఈల గుర్తుపై పడతాయి. ఫలితంగా జూపల్లికి పడాల్సిన ఓట్లు చీలిపోతున్నాయన్నమాట! కాంగ్రెస్ ముఖ్య నేతకు కావాల్సింది కూడా ఇదే! కొల్లాపూర్‌లో ప్రస్తుత వాతావరణాన్ని పరిశీలిస్తే బర్రెలక్కకు ఈజీగా మూడు నుంచి నాలుగు వేల ఓట్లు పడతాయనిపిస్తోంది. ఏమో ఈ సంఖ్య పెరగనూ వచ్చు. ఇవి కచ్చితంగా జూపల్లి కృష్ణారావుకు పడే ఓట్లే! కాంగ్రెస్‌లోని ఆ ప్రముఖ నేత ప్రమేయం లేకుండానే జూపల్లి కాంగ్రెస్‌లో చేరారు. ఇది కూడా ఆ నేత ఇగోను దెబ్బతీసింది. పైగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నిహితుడు కావడం ఆ ముఖ్య నేతకు ఇష్టం కావడం లేదు. అందుకే జూపల్లి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట! అందులో భాగమే బర్రెలక్కకు మద్దతు తెలపడం! మరి ఆ ముఖ్య నేత పాచికలు పారతాయా? జూపల్లిపై బర్రెలక్క ప్రభావం ఉంటుందా? అన్నది తెలియాలంటే వచ్చే నెల 3వ తేదీ వరకు ఆగాల్సిందే!