తెలంగాణలో(Telangana) గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారయ్యారు. గవర్నర్ కోటాలో ఉద్యమనేత, ఓయూ మాజీ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవికి(Prof Kodandaram MLC Post) నామినేట్ అయ్యారు. టీజేఎస్(TJS) అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో(Telangana) గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారయ్యారు. గవర్నర్ కోటాలో ఉద్యమనేత, ఓయూ మాజీ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవికి(Prof Kodandaram MLC Post) నామినేట్ అయ్యారు. టీజేఎస్(TJS) అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు(BRS) కేసీఆర్(KCR) సహచరుడిగా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ)కి నాయకత్వం వహించారు కోదండరాం. ఆ తర్వాత బిఆర్ఎస్ విధానాలతో విభేదించి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 2018 ఏప్రిల్లో కోదండరామ్ తెలంగాణ జనసమితి (టీజేఎస్) పేరుతో పార్టీని స్థాపించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కానీ..ఆ ఎన్నికల్లో టీజేఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే కోదండరామ్ మాత్రం తన వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరాం సేవలను తమ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటుందని ఆ మధ్య రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం..తాజాగా గవర్నర్ కోటాలో కోదండరాంను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు.