కాంగ్రెస్ పార్టీ ‘తెలంగాణ జన గర్జన’ పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ నేడు జరుగనుంది. ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో 150 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.
కాంగ్రెస్(Congress) పార్టీ ‘తెలంగాణ జన గర్జన’(Telangana Jana Garjana) పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ(Public Meeting) నేడు జరుగనుంది. ఖమ్మం(Khammam) జిల్లాలోని ఎస్ఆర్ గ్రౌండ్స్(SR Grounds)లో 150 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఖమ్మం జిల్లా కీలక రాజకీయ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy), మహబూబ్ నగర్(Mahboob Nagar)కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతోపాటు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర(Peoples March Padayatra) కూడా ఈ రోజే ముగియనుండడంతో ఈ సభ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఢిల్లీ(Delhi) నుంచి విజయవాడ(Vijayawada) గన్నవరం ఎయిర్‌పోర్ట్(Gannavaram Airport)కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం సభకు రానున్నారు. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి 5.30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం సభ తర్వాత రాత్రి 7.30 గంటలకు రాహుల్ రోడ్డు మార్గం ద్వారా గన్నవరం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.