తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 55 మందితో తొలి జాబితా విడుద‌ల చేసింది. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడు రోహిత్‌కు టికెట్ కన్ఫార్మ్ ఆయింది. ఇక ఇంట్లో ఒక‌రికే టికెట్ అని ప్ర‌చారం జ‌ర‌గ‌గా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Elections)ల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్(Congress) విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 55 మందితో తొలి జాబితా విడుద‌ల చేసింది. బీఆర్ఎస్‌(BRS)ను వీడి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హన్మంతరావు(Mynampalli Hanmantha Rao)తో పాటు ఆయన కుమారుడు రోహిత్‌(Rohith)కు టికెట్ కన్ఫార్మ్ ఆయింది. ఇక ఇంట్లో ఒక‌రికే టికెట్ అని ప్ర‌చారం జ‌ర‌గ‌గా.. మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)తో పాటు ఆయన సతీమణికి కూడా టికెట్ దక్కింది. ఉత్తమ్ హుజుర్‌నగర్, పద్మావతి(Padmavathi) కోదాడ నుంచి బరిలోకి దిగుతున్నారు.

కొండగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), నల్గొండ నుంచి ఎంపీ కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), మధిర నుంచి భట్టి విక్ర‌మార్క పోటీ చేయనున్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై తూమకుంట నర్సారెడ్డి పోటీ చేయ‌నుండ‌గా.. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి(Jeevan Reddy), కొల్లాపూర్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి బదులు ఆయన తనయుడు జయవీర్ బరిలో ఉండనున్నారు.

కాంగ్రెస్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్ధుల జాబితా వివ‌రాలు..

1. బెల్లంపల్లె - గడ్డం వినోద్
2. మంచిర్యాల -కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
3. నిర్మల్ -కూచాడి శ్రీహరి రావు
4. ఆర్మూర్- ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
5. బోధన్ -పి. సుదర్శన్ రెడ్డి
6. బాల్కొండ- సునీల్ కుమార్ ముత్యాల
7. జగిత్యాల -T. జీవన్ రెడ్డి
8. ధర్మపురి - అడ్లూరి లక్ష్మణ్ కుమార్
9. రామగుండం ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
10. మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
11. పెద్దపల్లి- చింతకుంట విజయ రమణారావు
12. వేములవాడ- ఆది శ్రీనివాస్
13. మానకొండూర్ - డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
14. మెదక్- మైనంపల్లి రోహిత్ రావు
15. ఆందోల్ - సి. దామోదర్ రాజనర్సింహ
16. జహీరాబాద్ - ఆగం చంద్ర శేఖర్
17. సంగారెడ్డి- తూర్పు జగ్గా రెడ్డి
18. గజ్వేల్- తూంకుంట నర్సారెడ్డి
19. మేడ్చల్- తోటకూర వజ్రేష్ యాదవ్
20. మల్కాజిగిరి- మైనపల్లి హనుమంతరావు
21. కుత్బుల్లాపూర్- కొలన్ హన్మంత్ రెడ్డి
22. ఉప్పల్- ఎం. పరమేశ్వర్ రెడ్డి
23. చేవెళ్ల - పమేనా భీం భారత్
24. పరిగి టి. రామ్మోహన్ రెడ్డి
25. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
26. ముషీరాబాద్- అంజన్ కుమార్ యాదవ్
27. మలక్‌పేట్- షేక్ అక్బర్
28. సనత్‌నగర్- డా. కోట నీలిమ
29. నాంపల్లి- మహమ్మద్ ఫిరోజ్ ఖాన్
30. కార్వాన్- ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ
31. గోషామహల్- మొగిలి సునీత
32. చాంద్రాయణగుట్ట -బోయ నగేష్
33. యాకుత్‌పురా- కె రవి రాజు
34. బహదూర్‌పురా -రాజేష్ కుమార్ పులిపాటి
35. సికింద్రాబాద్- ఆడమ్ సంతోష్ కుమార్
36. కొడంగల్- అనుముల రేవంత్ రెడ్డి
37. గద్వాల్ -సరితా తిరుపతయ్య
38. అలంపూర్ - S.A. సంపత్ కుమార్
39. నాగర్ కర్నూల్ - డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి
40. అచ్చంపేట - డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ
41. కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణరెడ్డి
42. షాద్‌నగర్- కె. శంకరయ్య
43. కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు
44. నాగార్జున సాగర్- జయవీర్ కుందూరు
45. హుజూర్‌నగర్- నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి
46. కోదాడ -నలమాడ పద్మావతి రెడ్డి
47. నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
48. నకిరేకల్ - వేముల వీరేశం
49. ఆలేరు - బీర్ల ఐలయ్య
50. ఘన్‌పూర్ (స్టేషన్) - సింగపురం ఇందిర
51. నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి
52. భూపాలపల్లె- గండ్ర సత్యనారాయణరావు
53. ములుగు సీతక్క
54. మధిర - భట్టి విక్రమార్క మల్లు
55. భద్రాచలం- పొదెం వీరయ్య"Written By : Senior Journalist M.Phani Kumar"

Updated On 17 Oct 2023 6:30 AM GMT
Yagnik

Yagnik

Next Story