భూమిలేని రైతు కూలీలకు ఆర్థిక సహాయాన్ని ఇస్తామన్న హామీని అమలుచేసేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.

భూమిలేని రైతు కూలీలకు ఆర్థిక సహాయాన్ని ఇస్తామన్న హామీని అమలుచేసేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.

రైతు భరోసా ఇవ్వడం పై అసెంబ్లీలో ప్రకటన చేసిన తెలంగాణ సర్కార్, ఇప్పుడు మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది. భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తున్నట్టుగానే.. భూమి లేని రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది. సవంత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 28 న జరగనున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నారు. భూమి లేని పేదలను గుర్తించి, వారికి నేరుగా అకౌంట్ లో ఈ డబ్బులు జమ చేసే విధంగా పథకాన్ని రూపొందించారు. అయితే మొదటి విడతగా రైతు కూలీల ఖాతాలో 6 వేల రూపాయలు వేయనున్నట్టుగా తెలుస్తుంది.

12 వేల రూపాయలను సంవత్సరంలో రెండు విడతలుగా రైతు కూలీల ఖాతాల్లో జామచేయడానికి ప్రభుత్వం ప్రణాలికను రూపొందిస్తుంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుతుందని ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు.

ehatv

ehatv

Next Story