ఈ నెల 26న ఆరు నూరైనా ఇచ్చిన మాట ప్రకా రం నాలుగు పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించి చెప్పింది. కానీ
ఈ నెల 26న ఆరు నూరైనా ఇచ్చిన మాట ప్రకా రం నాలుగు పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించి చెప్పింది. కానీ గ్రామ సభలు ఎలా జరిగాయో అందరికీ తెల్సిందే. ప్రతీ గ్రామంలో అధికారులను, అధికార పక్ష నేతలను ప్రజలు నిలదీశారు. ఈనెల 26 నుంచి నాలుగు పథకాలు అమలవుతాయని ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈనెల 26 నుంచి 4 పథకాలు మండలంలోని ఓ గ్రామం యూనిట్‌గా తీసుకొని అమలు చేస్తామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సాట్యురేషన్ మోడ్‌లో పథకాల అమలు చేస్తామన్నారు. అయితే దీనికి పూర్తిగా విరుద్ధ ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. రేపు కాదు..ఫిబ్రవరి నుంచి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అమలు చేస్తామన్నారు పొంగులేటి. రేపే అన్ని పథకాలు అందరికీ ఇవ్వాలనుకున్నామని కానీ కొత్త దరఖాస్తులు అధికంగా వచ్చినందున ఫిబ్రవరి మొదటి వారంలో పథకాల అమలుపై ప్రకటన చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రుల్లో సమన్వయం కొరవడటం పట్ల చర్చనీయాంశమైంది.