హైడ్రాపై కాంగ్రెస్ నేతల్లోనూ వ్యతిరేకత వస్తోంది. నిన్న దానం నాగేందర్ హైడ్రాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయగా
హైడ్రాపై కాంగ్రెస్ నేతల్లోనూ వ్యతిరేకత వస్తోంది. నిన్న దానం నాగేందర్ హైడ్రాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు మరో సీనియర్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy) కూడా గళం విప్పారు. తన జిల్లాలో ఏదైనా కూల్చివేత పనులు చేపట్టే ముందు తనను సంప్రదించాలని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్(AV RangaNath)ను కోరారు. తన జిల్లాలోని ప్రజలలో ఆందోళన కారణంగా జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారు.
ఎలాంటి సంక్షోభం వచ్చినా తన ఓటర్లకు అండగా నిలుస్తారని పేరున్న జగ్గారెడ్డి.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపడుతున్న హైడ్రా కారణంగా సంగారెడ్డి(SangaReddy) ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. హైడ్రా అధికార పరిధి ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఉంటుందని.. బయట కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. కాబట్టి సీఎం ప్రకటన ప్రకారం సంగారెడ్డిలో కూల్చివేతలు ఉండకూడదని జగ్గారెడ్డి అన్నారు.
ఏదైనా కూల్చివేతలను చేపట్టే ముందు అధికారులు తనకు తెలియజేయాలని జగ్గారెడ్డి అన్నారు. “ముందస్తుగా నాకు సమాచారం ఇస్తే.. నేను వెళ్లి ముఖ్యమంత్రితో చర్చిస్తాను. నాకు సమాచారం ఇవ్వకుండా.. అధికారులు వెళ్లి సంగారెడ్డిలో కూల్చివేతలకు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి అన్నారు. హైడ్రా కానీ రెవెన్యూ అధికారులు కానీ సంగారెడ్డి వాసుల్లో భయాందోళనలు సృష్టించవద్దని జగ్గా రెడ్డి అన్నారు.