Congress Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో... జగన్ పథకాలు కొన్ని, సిద్ధరామయ్య పథకాలు మరికొన్ని..
కాంగ్రెస్(Congress) పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో(Manifesto) ఉచితాలున్నాయి.. సంక్షేమపథకాలున్నాయి. వాటితో పాటు కేసీఆర్(KCR) సర్కారను ఇరుకున పెట్టే అంశాలూ ఉన్నాయి. అయితే సంక్షేమ పథకాలను చూస్తే మాత్రం ఎక్కడో విన్నట్టుగా.. ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) మేనిఫెస్టోకు దగ్గరగా ఉన్నట్టగా తోస్తున్నది. కొన్నింటినేమో కేసీఆర్ పథకాలకే కాసింత మెరుగులు దిద్దారనే భావన కలుగుతోంది. మహాలక్ష్మీ, గృహజ్యోతి, రైతుభరోసా, రైతు బీమా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల పెంపు, మహిళలకు ఫ్రీ రవాణా సౌకర్యం వంటి గ్యారంటీలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి వాటిపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు.
కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రకటించిన మేనిఫెస్టోలో(Manifesto) ఉచితాలున్నాయి.. సంక్షేమపథకాలున్నాయి. వాటితో పాటు కేసీఆర్(KCR) సర్కారను ఇరుకున పెట్టే అంశాలూ ఉన్నాయి. అయితే సంక్షేమ పథకాలను చూస్తే మాత్రం ఎక్కడో విన్నట్టుగా.. ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) మేనిఫెస్టోకు దగ్గరగా ఉన్నట్టగా తోస్తున్నది. కొన్నింటినేమో కేసీఆర్ పథకాలకే కాసింత మెరుగులు దిద్దారనే భావన కలుగుతోంది. మహాలక్ష్మీ, గృహజ్యోతి, రైతుభరోసా, రైతు బీమా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల పెంపు, మహిళలకు ఫ్రీ రవాణా సౌకర్యం వంటి గ్యారంటీలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి వాటిపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి 12 వేల రూపాయల సాయం, ఆర్టీసీ(RTC) విలీన ప్రక్రియ పూర్తిచేయడం, తొలి కేబినెట్‌లో మెగా డీఎస్సీ వంటి పథకాలు జగన్ అమలు చేసినవే! అన్నింటికంటే ముఖ్యమైనది అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం! ఇది అచ్చంగా జగన్ పథకమే! రైతు భరోసా పేరు కూడా జగన్ పథకం పేరే! జగన్(Jagan) విద్య, వైద్యరంగాలకు ఎక్కవ ప్రాధాన్యతనిస్తున్న విషయం విదితమే.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వైద్యరంగానికి బడ్జెట్‌ను పెంచుతామనే హామ ఉంది. అన్నికంటే ఆసక్తికలిగించే విషమేమిటంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్‌ను(Prajadarbar) నిర్వహంచడం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో కానీ జనం మధ్యలో ఉండరు. ఎప్పుడో కానీ సెట్రటేరియట్‌కు రారు. ఎమ్మెల్యే, మంత్రులకు అందుబాటులో ఉండరు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ హామీని ఇచ్చిందేమో! ఇక కాలేశ్వరం ప్రాజెక్ట్‌పై రిటైర్డ్ జడ్డీతో విచారణ జరిపించి, అందులో సాగిన అవినీతి, అక్రమాలను వెలికి తీసుకువస్తామని చెప్పింది. అమరుల కుటుంబాలకు నెలకు పాతిక వేల రూపాయల పెన్షన్‌ను అందిస్తామని తెలిపింది. కల్యాణమస్తు కింద లక్ష నగదు, తులం బంగారం అనేది జనాకర్షక పథకం మాత్రమే…ఆల్‌రెడీ కేసీఆర్ ఇస్తున్నదే ఇది! జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతారట. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు పి.వి.నరసింహారావు(P.V Narsimha) పేరు పెడతారట! ఇప్పుడున్న జిల్లాలే ఎక్కువయ్యాయని జనం అనుకుంటుంటే ఇంకొన్ని జిల్లాలు అవసరమా? ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూసేసిన చక్కెర కర్మాగారాలను తిరిగి తెరవడం అన్న హామీలు బాగున్నాయి. అమలవుతే ఇంకా బాగుంటాయి. చదువుకున్న యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలు మరో ప్రధాన హామీ! దళితబంధు తరహాలో ఎస్సీ, ఎస్టీలకు 12 లక్షల వరకూ ఆర్థికసాయం ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. మొత్తం మీద