సికింద్రాబాద్(Secunderabad) కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున శ్రీగణేశ్(Shri Ganesh) పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీగణేశ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ(Congress).
సికింద్రాబాద్(Secunderabad) కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున శ్రీగణేశ్(Shri Ganesh) పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీగణేశ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ(Congress). ఈమధ్యనే శ్రీగణేశ్ బీజేపీని(BJP) వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు. అయితే గణేశ్‌ను బరిలో దింపుతున్న కాంగ్రెస్‌పార్టీపై విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్(BRS) సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్‌కుమార్(Dasoju Sravan kumar). ' పార్టీ ఎవరినయినా ఎన్నికల బరిలో నిలబెట్టే అధికారం ఉంటుంది,
కానీ 2023 ఎన్నికలలో పార్టీ గెల్పుకొరకు కీర్తిశేషులు గద్దరన్న(Gaddaranna) కూతురును పోటీలో నిలబెట్టి, అధికారం చేజిక్కించుకున్నంక ఇప్పుడు వేరే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పచ్చి మోసం...ఓడలో ఉన్నంత వరకు, ఓడ మల్లయ్య, ఒడ్డు చేరినంక బోడ మల్లయ్య అన్నట్లుంది రేవంత్ రెడ్డి గారు మీ వ్యవహారం.వయోభారంతో అలసిపోయినప్పటికీ పట్టుదలతో కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కష్టకాలంలో పాదయాత్రలు చేసి, ఆడి, పాడి అసువులు బాసిన గౌరవ గద్దరన్నను, వారి కుటుంబాన్ని అవకాశవాదంతో విస్మరించి, అవమానించడం నేరం. సినిమా అవార్డులతో సంతోషపెట్టి, అసలు రాజ్యాధికారం మాత్రం రాకుండా నయవంచన చేయడం న్యాయమా రేవంత్‌రెడ్డిగారు' అంటూ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు.