ఇటీవల అశోక్ నగర్(Ashok Nagar) లోని హాస్టల్ లో యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ఆదివారం మంత్రి కేటీఆర్(KTR) మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ(Congress) ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రవళిక గ్రూప్స్ పరీక్షకు(Groups exams) దరఖాస్తు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇటీవల అశోక్ నగర్(Ashok Nagar) లోని హాస్టల్ లో యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ఆదివారం మంత్రి కేటీఆర్(KTR) మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ(Congress) ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రవళిక గ్రూప్స్ పరీక్షకు(Groups exams) దరఖాస్తు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్, ప్రవళిక గ్రూప్ 1, 2,3,4 దరఖాస్తులను ట్విట్టర్(Twitter) లో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. “ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం తపిస్తున్న డ్రామా రావు అడ్డంగా దొరికిపోయాడు.అసలు గ్రూప్స్ కే అప్లై చేయలేదు అని వాదించిన డ్రామా రావు మీరేం సమాధానం చెప్తారు. ఒక ఆడబిడ్డ చనిపోతే ఆమె పై ఇంత దారుణంగా నిందలు మోపి రాజకీయం చేస్తారా? నిరుద్యోగుల్లో మీ పై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు.ఈ ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పబోతున్నరు' అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. “ఓ ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంది.. రాష్ట్ర యువత అర్ధరాత్రి రోడ్డుపై భైఠాయించి న్యాయం కోరుతుంటే.. ఈ ముఖ్యమంత్రి ఏమయ్యాడు, హోంమంత్రి ఏమయ్యాడు ఎందుకు స్పందించలేదు...? “ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్టర్ లో ప్రశ్నించింది. అంతేకాదు అసలు ప్రవళిక తెలంగాణ కు చెందిన అమ్మాయి కాదు అని సైతం బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తారేమో..? అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.