గాంధీభవన్‌లో పిల్లలకు వైద్యం అందడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన కామెంట్‌పై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కౌంటర్ ఇచ్చింది.
గాంధీభవన్‌లో పిల్లలకు వైద్యం అందడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన కామెంట్‌పై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కౌంటర్ ఇచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party)ప్రైవేటుకు కొమ్ముకాయాలనుకుంటోందని చెప్పింది. మళ్లీ దీనికి కూడా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎక్స్(Twitter)లో ఆయన ఓ ట్వీట్ చేశారు. 'వైద్యం అందటం లేదు... పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహప్రభో అంటే బుదరజల్లుతున్నారు అని మాట్లాడతారా? మీరు ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాలనుకుంటే... హైదరాబాద్(Hyderabad)నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుపత్రులు, వరంగల్(Warangal)లో నడుస్తున్న అతిపెద్ద ఆసుపత్రి, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసే వాళ్లమా?
కేసీఆర్ కిట్లు, తల్లి-బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టేలా వాహనాలు, సాదారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవటం, రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న చోట 33మెడికల్ కాలేజీల ఏర్పాట్లు జరిగేవా? మాపై ఎదురుదాడి తర్వాత, ముందుగా మీ పాలనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోండి. పోయిన ప్రాణాలు తిరిగి రావు... ఆ తల్లుల కడుపుకోత తీర్చలేము. ప్రజలు కూడా మన బిడ్డలే అని మానవత్వంతో ఆలోచిస్తే మీ ఆలోచించే ధోరణితో పాటు మీ పాలన తీరు కూడా మారుతుంది. ఇప్పటికైనా మరణాలపై రివ్యూ చేశారా...? నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోకస్ చేశారా... లేదా? మొన్నటి బదిలీల్లో సీనియర్ డాక్టర్లను బదిలీపై పంపారన్న ఆరోపణల్లో వాస్తవం ఉందా... లేదా? ఇది చెప్పండి' అంటూ సవాల్ విసిరారు.