కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి మహిళను కొట్టిన వివాదంలో చిక్కుకున్నారు. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి మహిళను కొట్టిన వివాదంలో చిక్కుకున్నారు. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రచారంలో భాగంగా ఓ మహిళను మాజీ మంత్రి కొట్టిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. ఆర్మూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని ఓ గ్రామంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మరికొందరు నేతలతో కలిసి ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆర్మూరులో ఇతర నేతలతో కలిసి ప్రచారం నిర్వహించిన జీవన్‌రెడ్డి ఉపాధి కూలి పనులు చేస్తున్న మహిళ దగ్గరకు వెళ్లి ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తావని ప్రశ్నించారు. ఆమె వెంటనే ‘పువ్వు’ గుర్తుకు అని చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌కే ఓటేశానని, కానీ పెన్షన్ రావడం లేదని, ఈసారి కమలం గుర్తుకే ఓటేస్తానని చెప్పింది. దీంతో జీవన్‌రెడ్డి ఒక్కసారిగా ఆమెను కొట్టి ఏదో చెప్పడం వీడియోలో కనిపించింది. ఆయన చెంప మీద కొట్టగానే మిగతా నేతలు ఒక్కసారిగా నవ్వారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్ అయింది. ఆయన కోపంతో కొట్టలేదని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు.

Updated On 4 May 2024 12:20 AM GMT
Yagnik

Yagnik

Next Story